Elon Musk: త్వరలోనే ఎలాన్ మస్క్ ఆధీనంలోకి ట్విటర్..? భారీ ఆఫర్ ఇచ్చి మరీ..

Elon Musk: త్వరలోనే ఎలాన్ మస్క్ ఆధీనంలోకి ట్విటర్..? భారీ ఆఫర్ ఇచ్చి మరీ..
Elon Musk: ట్విట్టర్‌ను టేకోవ‌ర్ చేయ‌డానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Elon Musk: ట్విట్టర్‌ను టేకోవ‌ర్ చేయ‌డానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 3 లక్షల కోట్ల డీల్‌ ఆఫర్‌ చేశారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆఫర్ ఇచ్చానని, కంపెనీ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉందని, దానిని అన్‌లాక్ చేస్తానని చెప్పారు. ఈ ఆఫర్ అంగీకరించకపోతే షేర్‌హోల్డర్‌గా తన పాత్రను తిరిగి పరిశీలిస్తానని వివరించారు.

ఒక షేర్‌కు 54.20 డాలర్లు ఇస్తానని అన్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో ఈ వివరాలు తెలియజేశారు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ ఏప్రిల్ 1న ట్విట్టర్ స్టాక్ క్లోజింగ్ ప్రైస్ కన్నా 38 శాతం ప్రీమియం ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటీవల ట్విట్టర్ బోర్డులో చేరే ప్రణాళికను విరమించుకున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు.

బోర్డు సీటు తీసుకుంటే ట్విట్టర్‌ను టేకోవర్ చేయడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు. ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీంతో ఆయన ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుడిగా మారారు. ఈ వార్తతో ట్విట్టర్ షేర్ ధర 23 శాతం పెరిగింది. ఎలాన్ మస్క్ దగ్గర 73.5 మిలియన్ ట్విట్టర్ షేర్లు ఉన్నాయి.

ఆయన వాటా విలువ 2.9 బిలియన్ డాలర్లు. ఎలాన్ మస్క్ రివకబుల్ ట్రస్ట్ పేరుతో ఈ షేర్లు ఉన్నాయి. ట్రస్ట్‌కు ఆయన ఒక్కరే ట్రస్టీ కావడం విశేషం. 2009 లో ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో చేరారు మస్క్‌. ప్రస్తుతం 80 మిలియన్లకు పైగా అంటే 8 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కోసారి ఆయన ట్వీట్స్ వివాదాస్పదం కూడా అవుతుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story