EPF E-Nomination: మీకు ఈపీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఆ రూ.7 లక్షలు..

EPF E-Nomination (tv5news.in)

EPF E-Nomination (tv5news.in)

EPF E-Nomination: ఈకాలంలో ఏ ప్రభుత్వ రంగ సేవ అయినా.. ప్రైవేట్ రంగ సేవ అయినా.. ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటోంది.

EPF E-Nomination: ఈకాలంలో ఏ ప్రభుత్వ రంగ సేవ అయినా.. ప్రైవేట్ రంగ సేవ అయినా.. ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటోంది. అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ సేవలు కూడా అన్నీ ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి. వీటి వల్ల చిన్న పని కోసం కూడా ఈపీఎఫ్ఓ సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతోంది. తాజాగా ఈపీఎఫ్ మరో సేవను అందుబాటులోకి తెస్తుంది.

ఈపిఎఫ్ ఈ-నామినేషన్ పేరుతో ఓ కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది. ఈపీఎఫ్ నామినీ మార్చడం అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్. తాజాగా ఈ నామినీ ప్రకియను రెన్యువల్ చేసుకునే సమయం వచ్చేసిందని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేసే సమయం వచ్చేసిందని సంస్థ వెల్లడించింది.

నామినేషన్లో పేరు రెన్యువల్ అయిన తర్వాత తాజాగా పీఎఫ్ నామినేషన్ లో పేర్కొన్న నామినీ పేరును ఫైనల్‌గా పరిగణిస్తారు. ఖాతాదారుని తాజా నామినేషన్ తర్వాత ఇంతకు ముందు నామినేషన్ క్యాన్సిల్ చేసినట్లే అని అర్థం.

ఇక ఈపీఎఫ్ఓ ద్వారా పలు సేవలను కొత్తగా అందించనుంది. ‎ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే నామినీ జత చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది.


Tags

Read MoreRead Less
Next Story