Facebook Chang Name : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ పేరు మార్పు

Facebook Chang Name : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింది. ఇకపై దాన్ని మెటాగా పిలవనున్నారు. ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో మెటావర్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఫేస్‌బుక్ కంపెనీ ఆధీనంలో ఉన్న.. సోషల్‌మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం, వాట్సప్‌ల పేర్లు మాత్రం మారవు.. కేవలం మాతృ సంస్థ పేరును మాత్రమే మార్చారు. ఫేస్‌బుక్‌ను కొందరు దుర్వినియోగం చేయడం.. దీంతో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని మెటాగా రీబ్రాండ్ చేశామని ఆయన తెలిపారు. నకిలీ వార్తలను కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఇప్పటికే అమెరికన్ కాంగ్రెస్... ఫేస్‌బుక్ పై పలు ఆంక్షలు విధించింది. ఈ పరిణాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఫేస్‌బుక్ కంపెనీ పేరును జుకర్‌బర్గ్ మార్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com