Fast Tag At Toll Plaza: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేస్తే..

Fast Tag At Toll Plaza: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేస్తే..

Fast Tag Toll Plaza

Fast Tag At Toll Plaza: ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాల వద్ద 100 శాతం నగదురహిత టోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం 87 శాతం మంది ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నారు.

Fast Tag At Toll Plaza: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చే నెల మార్చి 1వ తేదీ వరకు ఫ్రీ ఫాస్ట్ ట్యాగ్ ప్రచారాన్ని ప్రకటించింది. ప్రయాణీకులు ఫాస్టాగ్‌ను వినియోగించే దిశగా ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా రూ.100 ట్యాగ్ ఖర్చును మాఫీ చేసింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాల్లో అమలవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాల వద్ద 100 శాతం నగదురహిత టోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం 87 శాతం మంది ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నారు.

కేవలం రెండు రోజుల వ్యవధిలో ఫాస్టాగ్ వినియోగించేవారి సంఖ్య 90 శాతానికి చేరుకుంది. ఒక్క రోజులోల ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్‌ను దేశవ్యాప్తంగా వసూలు చేశారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్స్ సేల్స్ జరిగినట్లు NHAI పేర్కొంది. వాహనదారుల వద్ద తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలని, లేదంటే జరిమానా తప్పదని చెబుతోంది. NHAI,IHMCL 40,000కు పైగా ఫాస్టాగ్ పాయింట్ ఆఫ్ సేల్స్‌ను ప్రారంభించాయి. పలు ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలోను ఫాస్టాగ్ కొనుగోలు చేయవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story