Flipkart: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.75 వేల టీవీ రూ.25 వేలకే..

Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.75 వేల విలువైన టీవీని రూ.25 వేలకు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో పలు టీవీలపై అనేక ఆఫర్లు ఇస్తు్న్నట్లు తెలిపింది.
సేల్‌లో భాగంగా వీయూ కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే అందుబాటులోకి తెచ్చింది. ఆల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.75 వేలు ఉండగా సేల్‌లో 49 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. దీంతో టీవీ ధర రూ.37,999 ఉండగా.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్‌తో మరో 1900 తగ్గుతుంది. ఫలితంగా ఈ టీవీ ధర రూ.36,099కి వస్తుంది.. ఒకవేళ ఎక్సేంజ్ చేసుకుంటే మరో రూ.11 వేల వరకు ఆదా. అంటే రూ.25,099కే టీవీ మీ ఇంటికి వచ్చేస్తుంది.
ఇక వీయూ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే..
డిస్‌ప్లే.. ఆల్ట్రా హెచ్‌డీ, ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ, రిజల్యూషన్: 3840 X 2160 పిక్సెల్స్, అప్ గ్రేడ్ రేట్: 60 హెచ్‌జెడ్, సౌండ్ స్పీకర్స్: 30 డబ్ల్యూ సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు. వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com