Flipkart Big Billiondays: అదిరిపోయే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Flipkart Big Billiondays: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ జవనరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని సరికొత్త సేల్‌ను ప్రకటించింది. వివిధ రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. బిగ్ బిలియన్ డేస్ 2022 ఫ్లిప్‌కార్ట్ పేరుతో ఈ సేల్ ఏర్పాటు చేసింది. జనవరి 17 నుంచి 22 వరకు సేల్ ఉంటుంది. కాగా, అమెజాన్ కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరిట ఓ సేల్ ప్రకటించింది. ఇది జనవరి 17 నుంచి 20 వరకు లైవ్‌లో ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో భాగంగా మొబైల్స్, ఫర్నిచర్, డిజిటల్ డివైజులు, బట్టలు వంటి వస్తువులపై అదిరిపోయే డిస్కౌంట్లు అందుబాటులోకి తెస్తోంది. ఇక ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకైతే జనవరి 16 నుంచే అందుబాటులోకి వస్తుంది. కొనుగోలు దారులు ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించిన వారికైతే అదనంగా మరో 10 శాతం రాయితీ లభిస్తుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, హెడ్ ఫోన్లు, స్పీకర్లు వంటి ఆడియో పరికరాలపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. స్మార్ట్ వేరియబుల్స్‌పై 60 శాతం, ల్యాప్ టాప్, డెస్క్ టాప్స్‌పై 40 శాతం, స్మార్ట్ ఫోన్ యాక్ససరీలపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.
అంతేకాదు స్మార్ట్ వాచీలపై 60 శాతం, టీవీ హోం అప్లయన్సెస్‌పై 75 శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇక దుస్తులపై కూడా 60 నుంచి 80 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com