కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ..

కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ప్రకటించింది. వినియోగ దారులను ఆకర్షించేందుకు బిగ్ సేల్ ఏర్పాటు చేసింది.

మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, దుస్తులు కొనాలనుకునేవారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ పేరుతో సంస్థ మరో కొత్త సేల్‌ని తీసుకువచ్చింది. ఈ సేల్ మార్చి 24 నుంచి మార్చి 26 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ సభ్యులు మాత్రం నేటి నుంచి సేల్‌లో పాల్గొనవచ్చు.

మూడు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది. ఎస్‌బిఐ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఇదిలా ఉంటే మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. మొబైల్ ప్రియుల కోసం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ మార్చి 22 నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో రియల్ మీ, పోకో, ఆపిల్‌కు సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story