FLIPKART: ఫ్లిప్‌కార్ట్‌ భారీగా ఉద్యోగ అవకాశాలు

FLIPKART: ఫ్లిప్‌కార్ట్‌ భారీగా ఉద్యోగ అవకాశాలు
X
క్విక్‌ డెలివరీకి ‘మినిట్స్‌’ సేవల విస్తరణ

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ నియామకాల ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా వివిధ విభాగాల్లో సుమారు 5,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుందని సంస్థ చెబుతోంది. క్విక్‌ కామర్స్‌, ఫిన్‌టెక్‌, కృత్రిమ మేధ (AI) రంగాల్లో వేగంగా ఎదుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సామర్థ్యవంతమైన టాలెంట్‌ను ఆకర్షించడమే లక్ష్యం అని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ సీమా నాయర్‌ వెల్లడించారు. సంస్థ ఇంటర్నల్‌ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ, “సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి ఈ నియామకాలు కీలకం” అని పేర్కొన్నారు.

క్విక్‌ డెలివరీకి ‘మినిట్స్‌’ సేవల విస్తరణ

ఫ్లిప్‌కార్ట్‌ తన క్విక్‌ కామర్స్‌ విభాగాన్ని 'మినిట్స్‌' పేరుతో విస్తరిస్తోంది. నగరాల్లో వినియోగదారులకు కొన్ని నిమిషాల్లోనే డెలివరీ చేయాలన్న లక్ష్యంతో ఈ సేవలు రూపుదిద్దుకున్నాయి. అదనంగా 'Super.money' పేరుతో యూపీఐ పేమెంట్‌ అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ రంగాల్లో పెరుగుతున్న వినియోగదారు స్థాయిని దృష్టిలో ఉంచుకొని మానవ వనరుల అవసరం ఏర్పడింది.

ఏఐ, ఫ్యాషన్‌, ఐపీవో లక్ష్యాల్లో భాగంగా...

2025లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై భారీ పెట్టుబడులు పెట్టిన ఫ్లిప్‌కార్ట్‌, ఫ్యాషన్‌ విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేయడానికీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అంతేకాకుండా, ఐపీవో (పబ్లిక్‌ ఇష్యూ) దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తన హోల్డింగ్‌ కంపెనీని సింగపూర్‌ నుంచి భారత్‌కు తరలించే యోచనలో ఉంది. నియామకాలు ఫ్లిప్‌కార్ట్‌ వ్యాపార వృద్ధికి మద్దతు అందిస్తాయని, కొత్త టాలెంట్‌ ద్వారా కొత్త మార్కెట్లను అధిగమించగలమనే నమ్మకంతో ఉన్నామని పేర్కొంది.

Tags

Next Story