ECONOMIC: భారత ఆర్థిక ఇంజిన్‌కు మరో బూస్ట్

భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే కీలక రంగాల్లో రైల్వే ఒకటి. ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతి బడ్జెట్‌కు ముందే భారీ అంచనాలు నెలకొంటాయి. రాబోయే బడ్జెట్ 2026లో రైల్వే రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునీకరణే ఈసారి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
రూ.2.65 లక్షల కోట్ల కేటాయింపులు
తాజా అంచనాల ప్రకారం, ఈసారి రైల్వే బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే సుమారు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ ఎండీ వివేక్ లోహియా అభిప్రాయం ప్రకారం, మొత్తం కేటాయింపులు రూ.2.65 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. ఈ కేటాయింపులు కొత్త ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ఉపయోగించనున్నారు.
రద్దీకి చెక్
సాంకేతికత లేకుండా రైల్వే అభివృద్ధి సాధ్యం కాదన్న దిశగా కేంద్రం ముందడుగు వేస్తోంది. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సిస్టమ్స్‌ను విస్తృతంగా వినియోగించనున్నారు. ప్రమాదాల నివారణ, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించాలన్నది లక్ష్యం.
రైల్వేలో ఏఐ విప్లవం
సాంకేతికత లేకుండా రైల్వే అభివృద్ధి సాధ్యం కాదన్న దిశగా కేంద్రం ముందడుగు వేస్తోంది. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సిస్టమ్స్‌ను విస్తృతంగా వినియోగించనున్నారు. ప్రమాదాల నివారణ, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించాలన్నది లక్ష్యం.
ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం
ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంపైనా బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. నిబంధనల సరళీకరణ, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా మరిన్ని కంపెనీలను రైల్వే ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
గేమ్ ఛేంజర్ ప్లాన్
ప్రస్తుతం మొత్తం సరుకు రవాణాలో రైల్వే వాటా 29 శాతంగా ఉంది. నేషనల్ రైల్ ప్లాన్ ప్రకారం 2030 నాటికి 3,000 మిలియన్ టన్నులు, 2045 నాటికి 45 శాతం వాటా సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ఈసారి బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. మొత్తానికి, బడ్జెట్ 2026లో రైల్వే రంగం సంఖ్యలకే పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు మరింత వేగం ఇచ్చేలా, ప్రయాణికుల భద్రత, సామర్థ్యం, లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా మారనుందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

