వారం రోజుల నుంచి వరుసగా.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్ ధర

వారం రోజుల నుంచి వరుసగా.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్ ధర
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల కారణంగా మంగళవారం దేశంలో మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి

దేశంలో గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల కారణంగా మంగళవారం దేశంలో మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 30 పైసలు పెరిగి రూ.89.29గా నమోదైంది. లీటర్ డీజిల్ 35 పైసలు పెరిగి రూ.79.70 వద్ద నిలిచింది.

ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో లీటర్ రూ.95.75గా నమోదైంది. డీజిల్ దర రూ.86.35 ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే పెట్రోల్ ధర గరిష్ట స్థాయిలో నమోదైంది. లీటర్ పెట్రోల్ ధర రూ.92.84 ఉండగా, డీజిల్ ధర రూ.86.93 ఉంది. ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడంతో అంతంత మాత్రంగా ఉన్న సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిపక్షాలు సైతం ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నాయి. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story