Petrol and diesel prices : దేశంలో ఆగని పెట్రో బాదుడు.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్..!

Petrol and diesel prices : పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా పెంచుతున్న చమురు సంస్థలు.. సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రో ధరల పెరుగుదల ఎంతలా ఉందంటే విమానంలో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కన్నా.. పెట్రోల్, డీజిల్ ధరలే ఎక్కువ. లీటరు ఏటీఎఫ్ ధర 79 కాగా, లీటరు పెట్రోల్ 110 రూపాయలు. అంటే ఏటీఎఫ్ కంటే పెట్రోల్ ధర 33 శాతం ఎక్కువ ఉంది.
ఇవాళ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు కనిపించకపోయినా.. ఈనెలలో పెట్రోల్‌పై మొత్తంగా 5 రూపాయలు పెరిగాయి. గత నాలుగు రోజులుగా రోజుకు 35 పైసల చొప్పున చమురు సంస్థలు పెంచాయి. అలాగే 12 రాష్ట్రాల్లో డీజిల్ ధరల సెంచరీ కొట్టి.. రికార్డుస్థాయిలో పెరుగుతూ పోతోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయల 44 పైసలు, లీటర్ డీజిల్ ధర 103 రూపాయల 54 పైసలుగా ఉంది. గత మూడు వారాల్లో పెట్రోల్ ధర 16 సార్లు, డీజిల్ ధర 19 సార్లు పెరిగింది. ఒక్క ఈ నెలలోనే లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై 5 చొప్పున రేట్లు పెరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పెట్రోల్ రేటు ఇప్పటికే 100 దాటేసింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటరు పెట్రోల్ ధర అత్యధికంగా 117 రూపాయలకు చేరగా, లీటరు డీజిల్ ధర 105.95గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com