ఒక్క పువ్వు రేటు రూ.20లక్షలా? 400ఏళ్ల చరిత్ర ఎందుకు తిరగేయాలి?

ఒక్క పువ్వు రేటు రూ.20లక్షలా? 400ఏళ్ల చరిత్ర ఎందుకు తిరగేయాలి?
జనం తులిప్ పూలపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు.అది కూడా వేలంవెర్రిగా,

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఓ మాట అన్నాడట..ఈ సృష్టిలో రెండు మాత్రం అనంతం, అవి ఎప్పటికీ నిలిచిపోతాయ్..శాశ్వతం అవి అని! మొదటిది విశ్వం అయితే రెండోది మనిషి మూర్ఖత్వం. ఈ రెండింటిలో మొదటిదాని గురించి నాకంతగా నమ్మకం లేదు కానీ..రెండోది మాత్రం సత్యం అన్నాడట..అంటే మనిషి మూర్ఖత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుందనేది ఆయన అభిప్రాయం..ఇప్పుడు ఆయన గురించిన ప్రస్తావన ఎందుకూ అంటే, గాబ్రియేల్ మాక్లోవ్ అని బ్రిటీష్

పెద్దాయన ఒకాయన ఉన్నాడు, ఐరోపా సెంట్రల్ బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, తనేమంటాడంటే ప్రస్తుతం బిట్ కాయిన్ క్రేజ్‌ను చూస్తుంటే నాకు బాగా ముచ్చటేస్తుంది. అంతేకాదు 385 ఏళ్ల క్రితం కూడా ఇంతే జరిగింది..అప్పుడేం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందేమో రెడీగా ఉండండి అంటూ హెచ్చరించారు

అప్పుడేం జరిగిందంటే, 16వ శతాబ్దంలో ఎలా ప్రారంభమైందో కానీ, జనం తులిప్ పూలపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు.అది కూడా వేలంవెర్రిగా, ఐతే ఆ బుడగ పేలడం ఆయా ఇన్వెస్టర్లనే కాదు మొత్తం

ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసింది. అప్పట్లో ఒక చిన్న పువ్వును ఆమ్‌స్టర్‌డామ్‌లోని లగ్జరీ ఇళ్ల రేటుకు కొనేశారట. తులిప్ పూలు, వాటి సాగుపై పెట్టుబడి పెడుతున్న ఎవరూ కూడా ఈ పరిణామాన్ని ఊహించలేకపోయారట. అంతేకాదు ఇప్పుడు మనం ఇలా చరిత్రలోకి వెళ్లి వారి అనుభవం తెలుసుకుంటామని అస్సలు ఊహించి ఉండరు. అప్పట్లోనే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కూడా ఈ తులిప్ ఫ్లవర్ ట్రేడింగ్‌లో డచ్ ప్రభుత్వం అనుమతించిందట

1636 వచ్చేనాటికి స్టాక్ ఎక్సేంజ్‌ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్‌లో తులిప్ బల్బ్స్‌ కోసం వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఓ స్థాయిలో కొన్ని అరుదైన తులిప్ జాతి పుష్పాల ఖరీదు ఓ సగటు మనిషి సంవత్సర ఆదాయానికి పదిరెట్లతో సమానంగా మారింది. ఉదాహరణకు కామన్ మేన్ శాలరీ ఇప్పుడు 2 లక్షలు అనుకుందాం (జస్ట్ ఎగ్జాంపుల్‌కే) తులిప్ పువ్వు రేటు 20లక్షలకు చేరినట్లు. అదే ఏడాది తులిప్ బల్బ్..బల్బులు పగిలిపోయాయ్. అంతే ఇక మార్కెట్‌లో తమకి ఉన్నదంతా పోగుచేసి ఈ పుష్పాలలో పెట్టుబడి పెట్టినవాళ్లంతా ఏమయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా..అదే ఆర్థిక వ్యవస్థ పతనానికి కూడా దారి తీసింది. అప్పటిదాకా భారీ ఇన్వెస్టర్లుగా పేరుపడ్డవాళ్లంతా దివాలా స్థితికి చేరుకున్నారు

రోజు రోజుకీ పెరిగిపోతున్న తమ తులిప్ బల్బ్‌ల వెలుగులో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్న ఊహలు తలకిందులు కావడంతో ఇన్వెస్టర్లు బిక్కచచ్చిపోయారు. చివరికి పూలమ్మిన చోటే కట్టెలు కాదు, ఆ పూలే ఎవరూ కొనకుండా పోవడంతో దివాలా తీసేశారు. ఆ తర్వాత అద్భుతమైన పంట పండిస్తాయనుకున్న తులిప్ పూలు మామూలు గడ్డిపూలల్లాగా చూడటం ప్రారంభమైంది..వాస్తవానికి అవి ఎప్పుడూ ఒకేలా ఉన్నాయి. వాటిపై మనిషికి ఉన్న మూర్ఖత్వమే( ఐన్‌స్టీన్ మాటలు-రచయిత అభిప్రాయాలు కావు) ఆ స్థాయిలో లేని విలువని ఆపాదించిపెట్టాయి. ఇదంతా చదివిన తర్వాత మీకు తులిప్ పూలు చూసినప్పుడు ఈ కథ ఖచ్చితంగా గుర్తుకురావాలి. అతిగా ఆవేశపడటం, ఆశ పడటం మంచిది కాదనే డైలాగ్ మదిలో మెదలుతుంది.

ఈ స్టోరీ అంతా కూడా బిట్‌కాయిన్ జోరుని చూసిన తర్వాత గాబ్రియేల్ మాక్లోవ్‌కి గుర్తుకురావడం అనూహ్యమేం కాదు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకి వచ్చింది కాబట్టి, ప్రభుత్వాల అనుమతుల కోసమే ఎదురుచూపులు కానీ, అవి కానీ దక్కాయంటే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గాబ్రియేల్ మాక్లోవ్ డబ్లిన్‌లో జరిగిన ఓ వెబ్‌నార్‌లో తులిప్‌మేనియా గుర్తు చేసుకున్నారు. బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసినవాళ్లు కూడా తమకి ఉన్నదంతా పోగొట్టుకోవడానికి ప్రిపేర్ అవ్వాలంటూ ఓ వార్నింగ్ ఇవ్వడం గమనించాలి. ఎనీవే, దాదాపు 400ఏళ్ల క్రితం ఏం జరిగిందన్నది ఓసారి ఇప్పటి తరానికి రిమైండ్ చేసినందుకు థ్యాంక్స్ టూ గాబ్రియేల్ మాక్లోవ్ !

Tags

Read MoreRead Less
Next Story