Gautam Adani : బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి.. బెజోస్‌ను పక్కను తోసి.. రెండవ స్థానంలో అదానీ..

Gautam Adani : అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరారు. అదానీ కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారని పోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నాల్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టిన అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీ రికార్డులకెక్కారు.
స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా ప్రపంచ కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో లిస్టులోని వ్యక్తుల స్థానాల్లో మారుతు ఉంటాయి. ఫోర్బ్స్ వివరాల ప్రకారం శుక్రవారం రాణించాయి. దీంతో ఆయన సంపద 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది. 155.7 బిలయన్ల డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారు. LCMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 149.7 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానానికి చేరారు. 92.3 బిలియన్ డాలర్లతో ముకేష్ అంబానీ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com