Petrol For 1 Rupee.. వావ్.. రూపాయికే లీటర్ పెట్రోలు..ఎక్కడో తెలుసా!

Petrol For 1 Rupee
దేశ వ్యాప్తంగా వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతోంది. ప్రతి రోజు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుబంటుండడంతో బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక హైదరాబాద్‌లో అయితే మంగళవారం(23-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.94.18కి చేరింది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.88.31కి చేరింది.
ఇక విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.62గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.90.20కి చేరింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో Petrol for 1 Rupee ( విదేశాల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే ) అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
భారత్‌తో పోలిస్తే పోరుగు దేశాల్లో పెట్రో ధరలు చాల తక్కువగా ఉన్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే.
ప్రపంచంలో వెనకబడిన దేశమైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు ( మన కరెన్సీలో రూ.1.45).
అత్యంత చౌకగా పెట్రోలు విక్రయించే మొదటి పది దేశాల్లో.. ఐదు ఆసియాలో ఉన్నాయి. మరో నాలుగు ఆఫ్రికాలో ఉన్నాయి. ఇక దక్షిణ అమెరికాలో ఒకటి ఉన్నాయి.
మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్‌లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నెదర్లాండ్స్ ఉన్నాయి.
ఇక మన దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 80.97గా ఉంది.
ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.78గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.56గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.00గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.06గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.59గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.85.98గా ఉంది.
బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.61గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 85.84గా ఉంది.
ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.59గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.88.52గా ఉంది.
విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.62గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.90.20గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com