ఎయిర్ పోర్టు వ్యాపారాన్ని విడిగా లిస్ట్ చేస్తున్న జీఎంఆర్‌

ఎయిర్ పోర్టు వ్యాపారాన్ని విడిగా లిస్ట్ చేస్తున్న జీఎంఆర్‌

జీఎంఆర్‌ గ్రూప్‌ను పునర్‌వ్యవస్థీకరించనున్నారు. ఇందుకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, జీఎంఆర్‌ పవర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ బోర్డులు కలిసి పునర్‌వ్యవస్థీకరణ చేస్తుంది. ఎనర్జీ, ఈపీసీ, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కలిపి ఓ సంస్థగా మారుస్తోంది. GILలో GPILవిలీనం అవుతుంది. గ్రూప్‌ వ్యాపారాల్లో వేర్వేరుగా దృష్టి కేంద్రీకరించి ఆయా రంగాల్లోని ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో GILవాటాదారులకు విలువను పెంచడానికి దోహదపడుతుంది. విమానాశ్రయ, విమానాశ్రయేతర వ్యాపారాలను వేర్వేరుగా లిస్టింగ్‌ చేయడం ద్వారా కార్పొరేట్‌ హోల్డింగ్‌ స్ట్రక్చర్‌ సరళమవుతుంది. జీఐఎల్‌ వాటాదారులందరూ జీపీయూఐఎల్‌లో వాటాదారులుగా మారతారు. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి 10 GIL షేర్లకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక GPUIL షేర్‌ను అదనంగా కేటాయిస్తారు. పునర్‌ వ్యవస్థకరణ పూర్తయిన తర్వాత కేవలం విమానాశ్రయాల వ్యాపారంలో ఉన్న ఏకైక లిస్టెడ్‌ కంపెనీ GIL అవుతుంది. వాటాదారులు, రుణదాతలు, ఉద్యోగులు, జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీలకు ఈ పునర్‌వ్యవస్థీకరణ ప్రయోజనం చేకూరుస్తుందని, వాటాదారుల వద్ద ఉన్న షేర్లకు విలువ పెరుగుతుందని GMR భావిస్తోంది. ఈ పథకానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, సెబీ, ఎన్‌సీఎల్‌టీ, వాటాదారులు, రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.834 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో నష్టం రూ.336 కోట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు తగ్గింది.

Tags

Read MoreRead Less
Next Story