బంగారం ధర భారీగా తగ్గింది.. దాదాపు రూ.1900

మహిళలూ.. మహరాణులూ.. మీకోసం బంగారం ధర భారీగా తగ్గింది.. పండగొస్తుంది.. పట్టుపరికిణీతో పాటు అమ్మాయికి ఓ చిన్న నగ కూడా ఉంటే ఎంత బావుంటుంది అని అనుకునే వారికి ఇదో సదవకాశం.. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న బంగారం ధరలో భారీ ఊరట కలిగి దాదాపు రూ.1900 వరకు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట‌్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1890 తగ్గడంతో.. రూ. 51,050కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,730 తగ్గుదలతో రూ.46,800కు పతనమైంది.
బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైపైకి చేరుకుంటోంది. కేజీ వెండి ధర రూ.100 పెరగడంతో రూ.61,700కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కిందకు దిగింది. ఔన్స్ ధర 0.18 శాతం తగ్గుదలతో 1903 డాలర్లకు క్షీణించగా, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. ఔన్స్ వెండి ధర 0.25 శాతం తగ్గుదలతో 24.34 డాలర్లకు దిగివచ్చింది. మొత్తానికి పండుగ సీజన్లో పసిడి ధర తగ్గడం మహిళలకు కలిసొచ్చే అంశం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com