Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరటనిచ్చే అంశం. వెండి కూడా ఇదే దారిలో పయనించడం పసిడి ప్రియులకు కలిసొచ్చిన అంశం.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.48,220కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.150 క్షీణించి రూ.44,200కు తగ్గింది.
ఇక వెండి విషయానికి వస్తే రూ.200లు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,000కు పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.11 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్సుకు 1797 డాలర్లకు ఎగసింది. వెండి రేటు కూడా పెరిగింది. ఔన్స్ వెండి 0.07 శాతం పెరుగుదలతో 23.5 డాలర్లకు చేరింది.
కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com