బంగారం కొనాలనుకునే వారికి నిరాశ..

బంగారం కొనాలనుకునే వారికి నిరాశ..
బంగారం ధరలు తగ్గుదల కంటే పెరుగుదలే ఎక్కువగా ఉంటుంది.

సామాన్య, మధ్య తరగతి జనం బంగారం కొనే పరిస్థితి లేదు. ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు కాస్త తగ్గినట్లు కనిపించినా అది కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు. ఇక నేటి బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45, 940 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,120 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 తగ్గింది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కొద్దిగా తగ్గి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,300 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధర రూ.50 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.570.40 ఉంది. గత సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజు 76.510 ఉంది. అక్కడి నుంచి సెప్టెంబర్ 24 నాటికి తగ్గుతూ కేజీ రూ.57,000కి పడిపోయింది. ఆ తర్వాత నుంచి హెచ్చు తగ్గులు నెలకొన్నాయి.

బంగారం ధరలు తగ్గుదల కంటే పెరుగుదలే ఎక్కువగా ఉంటుంది. తగ్గినా చిన్న మొత్తంలో తగ్గుతుంది. పెరగడం మాత్రం భారీగా పెరుగుతుంది. ఈ కారణంగానే గత సంవత్సరం జనవరి 26న ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల రూ.42,100 ఉండగా.. ఇప్పుడు అది రూ.50,120గా ఉంది. ఏడాది కాలంలో రూ. 8,020కి పెరిగింది. ఇది ఇన్వెస్టర్లకు ఆనందం కలిగించే అంశం. మన దేశంలో బంగారంపై మదుపు చేసే వారికంటే నగ రూపంలో కొనుగోలు చేసి ధరించే వారే ఎక్కువ. అందువల్ల బంగారం పెరగడం అనేది పసిడి ప్రియులకు నిరాశ కలిగించే అంశమే.

Tags

Read MoreRead Less
Next Story