బిజినెస్

Gold And Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు..

Gold And Silver Rates Today : నిన్నటితో (05-08-2022 శుక్రవారం) పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

Gold And Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు..
X

Gold and Silver Rates Today: నిన్నటితో (05-08-2022 శుక్రవారం) పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఈరోజు (06-08-2022 శనివారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,650 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,950గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ48,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,070గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. స్వల్పంగా రూ.400 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.63,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.63,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 58200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(06-08-2022 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES