పసిడి ధరలకు రెక్కలు..

పసిడి ధరలకు రెక్కలు..
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,050కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇదే దారిలో నడుస్తోంది. రూ.260 పెరుగుదలతో రూ.47,710కు ఎగసింది.

వెండి ధర కిలోకి రూ.290 పెరిగి రూ.63,600 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.17 శాతం పెరుగుదలతో 1889 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.52 శాతం పెరుగుదలతో 24.90 డాలర్లకు ఎగబాకింది. బంగారం, వెండి ధరల పెరుగుదలకు పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం వంటివి ప్రధాన కారణాలుగా చూపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story