పసిడి కొనుగోలుదారులకు ఊరట.. 10 గ్రాముల ధర

గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని బులియన్ మార్కెట్ వర్గీయులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 పడిపోయి రూ.49,100కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగరం రూ.440 తగ్గి రూ.45,010కు పడిపోయింది.
బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర మాత్రం నిలకడగా సాగుతోంది. ధరలో ఎటువంటి మార్పు లేదు. వెండి ధర కిలో రూ.64,700 వద్ద స్థిరంగా ఉంది. పరిశ్రమలు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ స్థబ్ధుగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే 1800 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్స్ కు 0.16 శాతం తగ్గుదలతో 1785 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్ కు 0.11 శాతం తగ్గుదలతో 22.61 డాలర్లకు క్షీణించింది. బంగారం ధరలో హెచ్చు తగ్గులకు అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com