Gold and Silver Rates Today: కాస్త పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి..!

Gold and Silver Rates Today:  కాస్త పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి..!
Gold and Silver Rates Today: బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు(14-08-2021 శనివారం) రూ. 100 పెరిగాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు(14-08-2021 శనివారం) రూ. 100 పెరిగాయి. ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్న(13-08-2021) రూ.43,600గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 43,700గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,560గా ఉండగా, ఈ రోజు రూ47,680గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,860గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ47,680గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ47,680గా ఉంది.

అటు వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు కూడా కాస్త తగ్గాయి. నిన్న(13-08-2021 శుక్రవారం)తో ధరలతో పోలిస్తే కేజీ వెండి ధర రూ. 20 తగ్గింది. ఈ రోజు(14-08-2021 శనివారం) కేజీ వెండి ధర రూ 67,500గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కొలకత్తా లలో కేజీ వెండి ధర రూ 62,500గా ఉండగా, హైదరాబాద్, చెన్నైలలో 67,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (14-08-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story