Gold And Silver Rates Today : స్థిరంగానే బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి!

Gold And Silver Rates Today : స్థిరంగానే బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి!
Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(31-12-2020) బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్న రూ. 46,700గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కూడా రూ. 46,700 గానే ఉంది.

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(31-12-2020) బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్న రూ. 46,700గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కూడా రూ. 46,700 గానే ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950గా ఉండగా, ఈ రోజు రూ. 50,950 గానే ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,120 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,420గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,930 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,300 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,160ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటితో పోలిస్తే వెండి ధరలు రూ.10 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 72.200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 72.200గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 68.400గా ఉంది. ఇక బెంగుళూరులో కేజీ వెండి ధర రూ. 68.300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 31-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story