GOLD: జెన్‌ జడ్‌ యువతకు బంగారం అంటే పెట్టుబడే!

GOLD: జెన్‌ జడ్‌ యువతకు బంగారం అంటే పెట్టుబడే!
X
బంగారం పెట్టుబడికి ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి... జెన్‌ జడ్‌ యువత: ఆభరణం కాదు, ఇన్వెస్ట్మెంట్

బం­గా­రం అంటే భా­ర­తీ­యు­ల­కు కే­వ­లం ఆభ­ర­ణం కాదు, ఆర్థిక భద్రత, పె­ట్టు­బ­డి. వి­వా­హా­ది శు­భ­కా­ర్యాల నుం­చి పం­డు­గల వరకు మహి­ళ­లు కొ­త్త ఆభ­ర­ణా­ల­ను కో­రు­కో­వ­డం సం­ప్ర­దా­యం. బం­గా­రం ధర పె­రు­గు­తు­న్నం­దున, పె­ట్టు­బ­డి కోణం నుం­చీ దీ­న్ని సమ­కూ­ర్చు­కో­వ­డం పె­ద్దల మాట. అయి­తే, నేటి 'జె­న్-జడ్' యువత మా­త్రం ఆభ­ర­ణాల కంటే పె­ట్టు­బ­డి - ప్ర­తి­ఫ­లం కో­ణం­లో­నే బం­గా­రా­న్ని చూ­స్తు­న్నా­రు. 'ఎంత కా­లా­ని­కి గి­ట్టు­బా­టు అవు­తుం­ది?', '24 క్యా­రె­ట్ల బి­స్కె­ట్లు/నా­ణే­లు కొం­దా­మా, లేక కమొ­డి­టీ మా­ర్కె­ట్‌­లో ట్రే­డిం­గ్‌ చే­ద్దా­మా?' అని ఆలో­చి­స్తు­న్నా­రు.

పెట్టుబడిలో బంగారం ప్రాధాన్యత

ఆర్థిక ని­పు­ణుల ప్ర­కా­రం, షే­ర్లు, బ్యాం­కు డి­పా­జి­ట్ల­తో పాటు పో­ర్ట్‌­ఫో­లి­యో­లో కొంత భాగం తప్ప­ని­స­రి­గా బం­గా­రం­పై పె­ట్టు­బ­డి ఉం­డా­లి. సం­క్షోభ సమ­యా­ల్లో షే­ర్ల వి­లువ పడి­పో­యి­నా, బం­గా­రం ధర మా­త్రం పె­రు­గు­తుం­ది. ఇది అత్య­వ­స­రా­ని­కి ఆస­రా­గా ని­లు­స్తుం­ది, తద్వా­రా నగదు అవ­స­రా­ల­ను తీ­రు­స్తుం­ది. ని­పు­ణుల సూచన ప్ర­కా­రం, అవ­స­రాల మే­ర­కు ఆభ­ర­ణాల రూ­పం­లో కొ­ను­గో­లు చే­సు­కు­ని, మి­గు­లు డబ్బు­ను మే­లి­మి (24 క్యా­రె­ట్ల) బం­గా­రం రూ­పం­లో పె­ట్టు­బ­డి పె­ట్ట­డం శ్రే­య­స్క­రం.

దేశీయ ధరలపై డాలర్ ప్రభావం

అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్‌­లో బం­గా­రం ధర డా­ల­ర్ రూ­పేణ తగ్గి­నా, దే­శీ­యం­గా మా­త్రం ధర అధి­కం­గా ఉం­టోం­ది. దీ­ని­కి ప్ర­ధాన కా­ర­ణం రూ­పా­యి మా­ర­క­పు వి­లు­వ­తో పో­లి­స్తే డా­ల­ర్ వి­లువ పె­ర­గ­డ­మే. డా­ల­ర్ మా­ర­క­పు వి­లువ రూ.88 దా­ట­డం వంటి పరి­ణా­మా­లు పసి­డి, వెం­డి ధరలు పె­ర­గ­డా­ని­కి దా­రి­తీ­స్తు­న్నా­యి.

పెట్టుబడికి భద్రత, స్వచ్ఛత కీలకం

బం­గా­రం కొ­ను­గో­లు­కు ప్ర­ధాన కా­ర­ణా­ల­లో ఒకటి, దీ­న్ని ప్ర­పం­చం­లో ఎక్క­డై­నా, ఎప్పు­డై­నా వి­క్ర­యిం­చు­కు­నే ధీమా. చి­న్న­పా­టి స్థ­లం­లో దా­చు­కు­నే వీలు. అయి­తే, కొ­ను­గో­లు­లో స్వ­చ్ఛత, బి­ల్లు తప్ప­ని­స­రి. పె­ద్ద వి­క్ర­య­శా­ల­ల్లో బి­ల్లు­తో­నే అమ్మ­కా­లు జరు­గు­తా­యి, రూ.2 లక్ష­ల­కు మిం­చి నగదు తీ­సు­కో­రు, పైగా 3% జీ­ఎ­స్‌­టీ చె­ల్లిం­చా­లి. బి­ల్లు లే­క­పో­తే నా­ణ్యత తక్కువ ఉన్నా ప్ర­శ్నిం­చే హక్కు ఉం­డ­దు. బం­గా­రు ఆభ­ర­ణాల స్వ­చ్ఛ­త­కు హా­మీ­గా ప్ర­భు­త్వం HUID ను తప్ప­ని­స­రి చే­సిం­ది. ఆభ­ర­ణా­ల­పై ప్ర­త్యేక గు­ర్తిం­పు సం­ఖ్య­ను ము­ద్రి­స్తా­రు. దీ­ని­ని 'BIS కే­ర్' యా­ప్‌­లో పరి­శీ­లిం­చి, ఆభ­ర­ణం వి­వ­రా­లు, స్వ­చ్ఛ­త­ను ధ్రు­వీ­క­రిం­చు­కో­వ­చ్చు. జిం­క్, రాగి, వెం­డి మి­న­హా ఇతర హా­ని­కర పదా­ర్థా­లు కలి­పి­తే HUID వే­య­రు. ఇది ఆభ­ర­ణా­ల­లో కల్తీ­ని ని­రో­ధిం­చే ము­ఖ్య­మైన చర్య. పాత బం­గా­రా­న్ని అంతే బరు­వు­న్న కొ­త్త ఆభ­ర­ణం­తో మా­ర్చు­కుం­టే జీ­ఎ­స్‌­టీ చె­ల్లిం­చా­ల్సిన పని­లే­దు. కానీ, కొ­త్త ఆభ­ర­ణా­ని­కి తరు­గు, మజూ­రి ఛా­ర్జీ­లు ఉం­టా­యి. నా­ణే­ల­కు కూడా ఇవి వర్తి­స్తా­యి. బి­స్కె­ట్ రూ­పం­లో కొనే మే­లి­మి బం­గా­రా­ని­కి మా­త్ర­మే ఈ ఛా­ర్జీ­లు ఉం­డ­వు. పె­ట్టు­బ­డి­కి భౌ­తిక బం­గా­రం కంటే డి­జి­ట­ల్ మా­ర్గా­లు మరింత శ్రే­య­స్క­రం. యూ­పీఐ యా­ప్‌­లు, ఎం­ఎం­టీ­సీ-పాం­ప్‌ వంటి మా­ర్గాల ద్వా­రా బం­గా­రం ధరను అను­స­రిం­చి ఎప్పు­డై­నా కొ­ను­గో­లు చే­యొ­చ్చు. భౌ­తిక బం­గా­రం డె­లి­వ­రీ తీ­సు­కో­వ­చ్చు లేదా ఆన్‌­లై­న్‌­లో­నే వి­క్ర­యిం­చ­వ­చ్చు. కొ­ను­గో­లు సమ­యం­లో 3% జీ­ఎ­స్‌­టీ ఉన్నా, వి­క్రయ సమ­యం­లో పన్ను ఉం­డ­దు. గో­ల్డ్ ఫం­డ్‌­లు, కమొ­డి­టీ ఎక్స్ఛేం­జ్‌ (MCX) లో ట్రే­డిం­గ్‌ ద్వా­రా కూడా పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­వ­చ్చు.

Tags

Next Story