'బంగారం' లాంటి ఆలోచన.. 'మదుపు' మంచిదే.. నిపుణుల అంచనా

బంగారం లాంటి ఆలోచన.. మదుపు మంచిదే.. నిపుణుల అంచనా
యాభైఏళ్ల క్రిందట పది గ్రాముల బంగారం రూ.190లు. ఇప్పుడు అదే బంగారం రూ.45 వేలు.. ఏడు నెలల క్రితం అయితే రూ.57 వేలు. చాలా మంది నగదు రూపంలో దాచుకోవడానికే ఇష్టపడతుంటారు.

బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ తప్పు కాదు. చిన్నమెత్తు బంగారం కొన్నా ఆర్థిక చిక్కుల్లో పడ్డప్పుడు ఆదుకుంటుంది. అవసరమైనప్పుడు కుదవపెట్టొచ్చు లేదా మరీ అవసరం అనిపిస్తే అమ్ముకోవచ్చు. పెట్టిన పెట్టుబడి కంటే రెండింతలు ఎక్కువే వస్తుంది. అందుకే భారతీయులు బంగారు ఆభరణాలపై మక్కువ చూపుతారు.

రెండు విధాలుగా పనికొస్తుందని. అయితే బంగారం కంటే వజ్రాలు ఇంకా విలువైనవి కదా వాటిని ఎందుకు కొనరు అని అమెరికా కాంగ్రెస్ రాన్ పాల్ అనే సెనెటర్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ బెన్ బెర్నాంకేను సూటిగా ప్రశ్నించారు. అది సంప్రదాయంగా వస్తున్న సురక్షిత సాధనం అని బెర్నాంకే సూటిగా సమాధానం చెప్పారు.

మిగతా అన్ని మదుపు సాధనాలతో పోలిస్తే బంగారంకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. యాభైఏళ్ల క్రిందట పది గ్రాముల బంగారం రూ.190లు. ఇప్పుడు అదే బంగారం రూ.45 వేలు.. ఏడు నెలల క్రితం అయితే రూ.57 వేలు. చాలా మంది నగదు రూపంలో దాచుకోవడానికే ఇష్టపడతుంటారు.

సేవింగ్స్ అకౌంట్లో వెయ్యి రూపాయలు వేసి 30 ఏళ్లు కదిలించకుండా ఉంటే అది ఇప్పుడు రూ.9,984 అవుతుంది. అదే బంగారం కొని దాచుకున్నట్లయితే అది రెండు మూడు రెట్లకు పైగానే ఉంటుంది. అదే వెయ్యి రూపాయలతో అప్పుడు బంగారం కొని ఉంటే దాని విలువ ఇప్పుడు రూ.19,700 అవుతుంది.

షేర్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన లేకుండా అందులోకి దిగడం అంత మంచిది కాదు. దాని కంటే పుత్తడిని నమ్ముకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. 20 ఏళ్ల కన్నా ఎక్కువ సమయం షేర్లలో పెట్టుబడి పెడితే రాబడి కాస్త ఎక్కువగానే వస్తుంది. కానీ గత ఐదేళ్లలో షేర్లు 14.2 శాతం రిటర్నులు పంచితే.. అదే పసిడి 14.4 శాతం రాబడిని ఇచ్చింది.

బంగారం పై పెట్టుబడి పెడితే వచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్క్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే బంగారంలో అయితే అలాంటి ఇబ్బందులు ఏవీ వుండవు.

బంగారాన్ని వస్తు రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనూ కొనవచ్చు. వీటిలో పెట్టుబడుల ద్వారా వచ్చిన సొమ్ములో 90 శాతం బంగారంలోనే మదుపు చేస్తారు. మిగతా 10 శాతం సొమ్మును బాండ్లు, సెక్యూరిటీల్లో పెడతారు. రిస్క్ చాలా తక్కువ. అన్నిటికన్నా ముఖ్యంగా ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడితే దొంగతనం జరిగే రిస్క్, తరుగు నష్టం వంటివి ఉండవు.

2018 ఆగస్టులో రూ.29 వేలు పలికిన బంగారం ధర రెండేళ్లు అయ్యేసరికి రూ.57 వేలకు చేరుకుంది. రెండేళ్లలో దాదాపు రెట్టింపయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ తగ్గి ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.42,800 నుంచి రూ.39,500 మధ్య ఉంది. ఈ స్థాయికి మించి పతనం ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

Tags

Read MoreRead Less
Next Story