బంగారం ధర ఒక్కరోజులో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1.049 తగ్గి రూ.48.569కి చేరింది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. కిలో వెండి ఒక్క రోజులో రూ.1.588 తగ్గి రూ.59.301 కి పడిపోయింది. మంగళవారం ముంబై మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.48,975గా నమోదైంది. కిలో వెండి రూ.59,704 వద్ద ఆగిపోయింది. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందన్న సమాచారంతో అమెరికన్ ఈక్విటీ మార్కెట్లో ఉత్సాహం పెరిగింది. ఆర్ధిక అనిశ్చితి తగ్గుతుండడంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి క్రమంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. తత్ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 1,810 డాలర్లు కాగా వెండి 23 డాలర్లకు దిగివచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com