ఇండియాలో గోల్డ్ డిమాండ్ పడిపోవడానికి కారణాలివేనా..?

ఇండియాలో గోల్డ్ డిమాండ్ పడిపోవడానికి కారణాలివేనా..?


కరోనా సంక్షోభం, పెరిగిన ధరలతో బంగారం డిమాండ్ పడిపోయింది. దేశంలో అమ్మకాలు లేక తీవ్రం ఒత్తిడిలో ఉందని వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ 86.6 టన్నులకు పరిమితం అయిందని వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలానికి 123.9 టన్నుల డిమాండ్‌ ఉండింది. అంటే 30 శాతానికి పడిపోయింది. గడిచిన మూడు నెలల్లో గోల్డ్‌ డిమాండ్‌ 4 శాతం తగ్గి రూ.39,510 కోట్లకు పరిమితమైంది. 2019లో ఇదే సమయానికి రూ.41,300 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. 19 శాతం తగ్గి 892.3 టన్నులకు పరిమితమైందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2009లో సెప్టెంబరు త్రైమాసికం తర్వాత మళ్లీ కనిష్ఠస్థాయి అంటోంది నివేదిక.

కారణాలివేనా..?

కరోనా ఎఫెక్ట్ బలంగా పనిచేసింది. లాక్ డైన్ కారణంగా శుభకార్యాలు ఆగిపోయాయి. మార్కెట్లు మూతపడ్డాయి. కేవలం ఇన్వెస్టర్లు తప్ప.. అవసరాలకు ఎవరూ కొనకపోవడంతో పరిస్థితి తారుమారైందన్నారు. బంగారు ఆభరణాల డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 48 శాతం తగ్గి 52.8 టన్నులకు జారుకుంది. దీంతో పాటు ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలించి, ఆగస్టులో ధరలు స్వల్పంగా కరెక్షన్ రావడంతో మళ్లీ మెరుగుదల కనిపిస్తోంది. పెట్టుబడులు మాత్రం 52 శాతం పెరిగి 33.8 టన్నులకు చేరుకుంది.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story