దిగివస్తోన్న బంగారం ధర

దిగివస్తోన్న బంగారం ధర

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పడిపోయాయి. సిల్వర్ ధరలు మాత్రం పెరిగాయి. MCX మార్కెట్లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.16శాతం తగ్గి 10గ్రాములు రూ.50070 వద్ద కదలాడింది. వరసగా 5 రోజుల్లో నాలుగోసారి ధర తగ్గింది. అటు సిల్వర్ 0.1శాతం పెరిగి కేజీ 67641 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇటీవల కాలంలో బంగారం 48వేలకు పడిపోయింది. మళ్లీ 50వేల టచ్ కావడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయిగే ఆగస్టులో 56200 వద్ద ట్రేడ్ అయింది. దీనికి ఇంకా 6వేల దూరంలోనే ఉంది. సిల్వర్ కూడా అప్పట్లో కేజీ రూ.80వేలు టచ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1872.60 డాలర్లుగా ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్ 0.01శాతం తగ్గి 1877.00 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story