గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధర కొంత శాంతించింది. యూఎస్ బాండ్ ఈల్డ్‌పై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరగడంతో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గత కొన్నిరోజులుగా అప్‌ట్రెండ్‌లో ఉన్న గోల్డ్ శుక్రవారం ఒక్కరోజే 4శాతం పైగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.2050 తగ్గి రూ.48818కు పడిపోయింది. ఇక వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. కిలో వెండి ధర 8.8శాతం పైగా అంటే రూ.6100 తగ్గి రూ.63850కు పడిపోయింది.
కారణం ఏంటంటే..?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పతనం కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనిపించింది. గత కొన్ని రోజులుగా 1900 ఎగువన స్థిరంగా కదలాడుతోన్న ఔన్స్ గోల్డ్ శుక్రవారం 4శాతం పైగా క్షీణించి 1833 డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్లోనూ సెంటిమెంట్ బలహీనపడి ధరలు దిగివచ్చాయి.
ఉద్దీపన ప్యాకేజీ కూడా కారణమా..?
యూఎస్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొనడం, గత కొంతకాలం నుంచి డాలర్ వీక్‌గా ఉండటం, అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే అంచనాలు బలపడటంతో పదేళ్ళ బాండ్ ఈల్డ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం పదేళ్ళ బాండ్ ఈల్డ్ గత ఏడాది మార్చి గరిష్ట స్థాయి వద్ద కదలాడుతోంది.
https://www.profityourtrade.in/market-news/gold-silver-rates-fall/250
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com