Gold Price: బంగారం ధరలు భారీగా.. నాలుగేళ్ల తర్వాత..

Gold Price: గోల్డ్ కొనాలనుకునేవారికి శుభవార్త.. ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు మూడు నెలల కనిష్టానికి చేరాయి. బుధవారం మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 2016 తర్వాత భారీగా ధర పడిపోయిన నెల ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి.
నిన్న రూ.47,079 ఉన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.300 పడిపోయి రూ.46,773కు చేరుకుంది. జూన్ 17 తర్వాత ఇంత మొత్తంలో బంగారం ధర పడిపోవడం ఇదే మొదటిసారి. ఇక ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.43.124 నుంచి రూ.42.844కు పడిపోయింది.
ఈ నెలలో 10 గ్రాముల బంగారం ధర 7.6 శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 3.2 శాతం ఎగిసింది. గత ఏడాది రూ.56.200 గరిష్టం నుంచి రూ.10వేలకు పడిపోయింది. ఇక ఈ నెలలోనే రూ.2,700కు దిగి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 క్షీణించి రూ.43,750కు పడిపోయింది.
స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 క్షీణించి రూ.47,730కు చేరుకుంది. పసిడి ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే క్షీణించాయి. నిన్న రూ.68,269 ఉన్న కేజీ వెండి ధర రూ.522 క్షీణించి రూ.67,747కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,763.63 డాలర్లకు చేరుకుంది. అంటే నాలుగు సంవత్సరాల్లో ఇదే అతి పెద్ద పతనం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com