అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పడిపోతున్న బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పడిపోతున్న బంగారం
డాలర్ మళ్లీ బలపడుతోంది. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

కోవిడ్ స్ట్కెయిన్ కారణంగా డాలర్ మళ్లీ బలపడుతోంది. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం అంతర్జాతీయ మార్కెట్లో 1.3శాతం పడిపోయి ఔన్స్ గోల్డ్ 1874డాలర్లు పలికింది.

అంతకుముందు నవంబర్ 1906 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. నవంబర్ తర్వాత గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్న సమయంలో కోవిడ్ కొత్త వైరస్ గండి కొట్టింది. ఫ్యూచర్స్ కూడా 0.6శాతం పడిపోయి 1877.70 వద్ద ట్రేడ్ అయింది. అయితే ఇందుకు భిన్నంగా సిల్వర్ ధరలు మాత్రం పెరిగాయి. 1శాతం పెరిగి 26.02డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story