వరుసగా రెండో రోజూ బంగారం ధరల్లో తగ్గుదల.. 10 గ్రాములు..

వరుసగా రెండో రోజూ బంగారం ధరల్లో తగ్గుదల.. 10 గ్రాములు..
డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది.

పసిడి ధరలు వరుసగా రెండో రోజు క్షీణించాయి. నిన్న గురువారం ఓ సమయంలో భారీగా తగ్గి రూ.49,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత కాస్త పుంజుకున్నాయి. రూ.200కు పైగా నష్టపోయినప్పటికీ, చివరకు రూ.49,000 పైన క్లోజ్ అయింది. ఇటీవల బంగారం ధరల్లో మార్పులు ఎక్కువగా కనబడుతున్నాయి.

రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. పసిడి ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56299తో రూ.7200 వరకు తక్కువగా ఉంది. రూ.49,000 పైన ఉన్న పసిడి ధర నేడు (శుక్రవారం 15, జనవరి) ఉదయం ఎంసీఎక్స్‌లో రూ.49,160 వద్ద ట్రేడ్ అయింది.

కూ.49,088 వద్ద ప్రారంభమైన ధర రూ.49,188.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,077 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు తక్కువగా ఉంది. వెండి కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి రూ.568 తగ్గి రూ.66,115 వద్ద ట్రేడ్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story