Gold Rate: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

Gold Rate: నిన్నటి వరకు భారీగా పతనమైన పసిడి ధరలు నేడు (మార్చి 9, మంగళవారం) స్వల్పంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభమైన మూడు నెలల కాలంలోనే రూ.5 వేల వరకు తగ్గాయి. కరోనా వ్యాక్సిన్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. ఈ ప్రభావం పసిడిపై కూడా పడింది. బిట్ కాయిన్ ప్రభావం కూడా గోల్డ్ ధర తగ్గుదలకు కారణమైంది. నిన్న ఒక్కరోజే రూ.500 వరకు తగ్గింది.
11 నెలల కనిష్టానికి సమీపంలో గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX) లో బంగారం ధర నేడు ఉదయం సెషన్లో రూ.44,500 దిగువన ఉంది. రూ.67,249.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,249 వద్ద గరిష్టాన్ని, రూ.67,249.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, 1700 డాలర్లకు దిగువనే ఉన్నాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.75 (+0.52%) డాలర్లు పెరిగి 1686.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,676.85-1676.85-1688.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్ ధర 0.138 (+0.55%) డాలర్లు పెరిగి 25,402 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25,095- 25,503 డాలర్ల మద్య కదలాడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com