బంగారం ధరలు భారీగా.. ఈ పరిస్థితుల్లో కొనుగోలు !!

గత ఏడాది రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, ఈ ఏడాది ఊహించని స్థాయిలో బంగారం ధర నిరంతరం పడిపోతోంది. 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఏడాది పది గ్రాములకు రూ. 11,000 తగ్గింది.
బంగారం ధర గత ఆగస్టులో 10 గ్రాములకు రూ .54,750 వద్ద రికార్డు స్థాయిని తాకింది. దేశ రాజదాని దిల్లీలో శనివారం నమోదైన ప్రస్తుత బంగారం ధర 10 గ్రాములకు రూ .43,590. ఈ విధంగా, గత ఏడు నెలల్లో బంగారం ధర పతనం 10 గ్రాములకు రూ .11,160.
వెండి ధరలో పతనం
ఈ పతనం ఒక్క పసిడిలోనే కాదు, వెండి ధరలు కూడా మార్కెట్లో పడిపోతున్నాయి. ఫిబ్రవరి 1 న కిలో వెండి ధర రూ .73,300 ఉండగా అదే మార్చి 6 నాటికి కిలోకు రూ .65,700 కు పడిపోయింది. పారిశ్రామిక వినియోగానికి డిమాండ్ తగ్గడమే వెండి ధర తగ్గడానికి కారణంగా మార్కెట్ వర్గీయులు చెబుతున్నారు.
బంగారాన్ని తనఖా పెట్టిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను ఎక్కువ బంగారాన్ని జమ చేయాలని లేదా బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న రుణంలో కొంత భాగాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
బంగారం ధర తగ్గడానికి కారణాలు
ప్రస్తుతం 2021-22 బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసింది. అదేవిధంగా, యుఎస్ డాలర్ పెరుగుదల, బాండ్లపై నమ్మకం, అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడన్ పరిపాలన విధానాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయి.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తెరవడం కూడా బంగారం ధరల పతనానికి దోహదపడింది. మార్కెట్ వర్గాల ప్రకారం, కొనుగోలుదారులు మరింత వేచి ఉండడం మంచదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com