Gold: పసిడి ప్రియులకు శుభవార్త.. పది గ్రాముల ధర..

Gold: గత కొద్ది రోజులుగా పసిడి ధరల్లో స్వల్ప మార్పులు సంభవిస్తున్నాయి. అయితే శుక్రవారం ఒక్కసారిగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.451 తగ్గి రూ.46,844కు చేరింది. అంతకు ముందు దీని ధర కూ.47,295గా ఉంది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.559 తగ్గి రూ.67,465కు చేరింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రూ.1805 అమెరికా డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.93 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులే విలువైన లోహపు ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,200కు (అన్ని ట్యాక్సులతో కలిపి) పైగా ట్రేడవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com