బంగారంపై పెరుగుతున్న ఆశలు

బంగారంపై పెరుగుతున్న ఆశలు
అంతర్జాతీయ విఫణిలో సానుకూల సంకేతాలు ఉండటంతో దేశీయ మార్కెట్లోనూ

ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ విఫణిలో సానుకూల సంకేతాలు ఉండటంతో దేశీయ మార్కెట్లోనూ

పెరుగుదల కనిపించింది. అటు వెండి ధరలు కూడా దాదాపు 3శాతం పెరిగాయి.

మల్టీ కమాడిటీ ఎక్చేంజ్ లో MCXలో ఫిబ్రవరి గోల్డ్ ట్రేడింగ్ 0.73శాతం పెరిగి రూ.50670 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు మార్చి సిల్వర్ కూడా 2.85శాతం పెరిగింది. కిలో రూ. 69,842 వద్ద ట్రేడ్ అవుతోంది.

అమెరికా కాంగ్రెస్ సెనెటర్లు 900 బిలియన్ డాలర్లు ఉద్దీపన ప్యాకేజీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇవాళ చర్చించే అవకాశం ఉంది. కరోనా ద్వారా నష్టపోయిన ఇండస్ట్రీని ఆదుకునేందుకు ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నారు. దీంతో యూఎస్ లో మళ్లీ బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు.

గడిచిన వారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. సిల్వర్ కూడా అదే దారిలో నడిచింది. బంగారం చాలారోజుల తర్వాత 1900 డాలర్లు దాటింది. సిల్వర్ కూడా 26డాలర్లకు చేరింది.

Tags

Next Story