Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..
మరోసారి బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మెటల్ ధరలు బంగారంపై సానుకూల ప్రభావాన్నే చూపించాయి.

మరోసారి బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మెటల్ ధరలు బంగారంపై సానుకూల ప్రభావాన్నే చూపించాయి. అందుకే నేడు బంగారం ధర 100 గ్రాములకు రూ. 600 తగ్గింది. దాని వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో ధర 10 గ్రాములు 22 క్యారెట్లకు రూ. 43,600 కు చేరింది.

ఫ్యూచర్ ట్రేడ్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 46,075 నిలిచింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఇండియాలో టర్నోవర్‌లో బంగారం ధర 1.28 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు USD 1,746.84 వద్ద ఉండగా, US బంగారు ఫ్యూచర్స్ USD 1,747.80 వద్ద తగ్గాయి.

ముంబాయిలో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.45,300 ఉంది. ఢిల్లీలో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 45,750 ఉంది. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 43,880 ఉంది. బెంగళూరులో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 43,800 ఉంది.

Tags

Read MoreRead Less
Next Story