గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మొన్నటిదాకా కస్టమర్లు లేక వెలవెలబోయిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.

మొన్నటిదాకా చుక్కలనంటిన బంగారం ధరలు.. తగ్గు ముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర.. ప్రస్తుతం 48 వేలకు పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 48 వేలు, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 44 వేలకు తగ్గింది. కేవలం ఐదు రోజుల్లోనే తులం బంగారం ధర 2 వేలు తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొన్నటిదాకా కస్టమర్లు లేక వెలవెలబోయిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా దిగివచ్చాయి. కేజీ వెండి ధర 73 వేల 400 రూపాయలకు తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,060గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,730గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,160గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,410గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,790గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,490గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,060గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,070గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,060గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 07-02-2021 ఉదయం 11 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.






Tags

Read MoreRead Less
Next Story