గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్..పడిపోయిన పసిడి ధర!

గోల్డ్ కొనాలని భావించే వారికి ఊరట కలిగించే అంశం. పసిడి ధర మళ్లీ పడిపోయింది. ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చి గురువారం నిలకడగా కొనసాగిన బంగారం ధర శుక్రవారం పడిపోయింది. శనివారం కూడా అదే దారిలో బంగారం ధర దిగివచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.47,500 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.50 తగ్గింది. రూ.51,800కు క్షీణించింది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,830 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,860గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,830గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,660గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,170గా ఉంది.
ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,900గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,810గా ఉంది.
ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,800గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 06-01-2021 ఉదయం 9 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com