2021లో బంగారం కొనగలమా?

2021లో బంగారం కొనగలమా?

2020లో పసిడి జనాలకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. మరి వచ్చే ఏడాది కూడా సిరులు కురిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాయి మార్కెట్ వర్గాలు. 10 గ్రాముల బంగారం 63 వేల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 50వేల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్‌ బలహీనపడడం, ఉద్దీపన ప్యాకేజీలు, తక్కువ వడ్డీ రేట్లు వెరసి బంగారంపై పెట్టుబడికి సానుకూలంగా మారతాయని అంటున్నారు. జనాల చేతిలో డబ్బులంటాయి. కాబట్టి బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించవచ్చు.

2019తో పోలిస్తే 2020లో పుత్తడి బాగానే కలిసివచ్చింది. ఏడాది ప్రారంభంలో రూ.39వేల వద్ద ఉన్న పది గ్రాముల గోల్డ్ ప్రైస్ ఆగస్టులో రూ.56,200కు చేరింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు క్షీణించటం, స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.51,600- 52,000 మధ్య ట్రేడవుతోంది.

పెట్టుబడి లాభాల కోసం 2021లో ఇన్వెస్టర్లు మరింత దూకుడుగా పసిడి కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనా. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.57,000 నుంచి రూ.63,000 మధ్య, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ ధర 2,150 డాలర్ల నుంచి 2,390 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత, చైనాల్లో గోల్డ్ కొనుగోళ్లు తగ్గాయి. 2021లో ఈ కొనుగోళ్లు బాగా పెరగనున్నాయి. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.60,000 స్థాయిని తాకుతుందని HDFC సంస్థ అంచనా వేస్తోంది. సొ.. ఇన్వెస్టర్లు గోల్డ్ పైనా ఓ కన్నేసి ఉంచవచ్చు.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story