LIC Policy Holders : ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకి ఉచితంగా క్రెడిట్ కార్డు..!

LIC Policy Holders : ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకి ఉచితంగా క్రెడిట్ కార్డు..!
LIC Policy Holders లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ పాలసీ దారులకు శుభవార్త చెప్పింది.

LIC Policy Holders లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ పాలసీ దారులకు శుభవార్త చెప్పింది. కస్టమర్ లేదా పాలసీ హోల్డర్, ఏజెంట్లకి ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీ సీఎస్ఎల్ కోలాబరేషన్‌లో ఎల్ఐసీ రూపే క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. లూమిన్ కార్డు, ఎక్లాట్ కార్డు పేరుతో ఈ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది ఎల్ఐసీ. ప్రజలందరికీ కూడా ఈ కార్డులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా పలు రకాల ప్రయోజనాలను ఎల్ఐసీ అందిస్తోంది.

ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే.. 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది.

♦ 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొంటే, వాటిని తేలికగా ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చు.

♦ లూమిన్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 50వేలు గాను, ఎక్లాట్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.2 లక్షలుగా ఉంది.

♦ కార్డు వాలిడిటీ నాలుగేళ్లుగా ఉంది.

♦ లూమిన్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే.. 3 డిలైట్ పాయింట్లను మీరు పొందవచ్చు.

♦ ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే.. 4 డిలైట్ పాయింట్లు వస్తాయి.

♦ పాలసీ హోల్డర్ ఈ కార్డులను వాడి ప్రీమియాన్ని చెల్లిస్తే.. రివార్డు పాయింట్లు రెండింతలు ఎక్కువగా వస్తాయి. ప్రతి రూ.100 వెచ్చింపుపై మీకు ఆరు నుంచి ఎనిమిది రివార్డు పాయింట్లు లభిస్తాయి.

♦ ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డు హోల్డర్స్‌కు దేశీయ, అంతర్జాతీయ విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్ కూడా లభిస్తుంది.ఈ కార్డుల యూనిక్ ఫీచర్ ఏమిటంటే..ఎలాంటి ప్రాసెసింగ్ కాస్ట్ ఉండదు.

♦ ఈ కార్డులకు ఎలాంటి మెంబర్‌షిప్ ఫీజులు కానీ లేదా యాన్యువల్ ఫీజులు కానీ చెల్లించాల్సివసరం లేదు.

♦ ఈ క్రెడిట్ కార్డులకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.5 లక్షల వరకు సమ్ అస్యూర్డ్ అవుతుంది.

♦ మీ పేరుపై ఇప్పటికే ఒక కార్డు ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో మరిన్ని యాడ్-ఆన్ కార్డులను మీరు పొందవచ్చు.

♦ మీరు మీ అవసరాలకు అనుగుణంగా మీ డబ్బును 3, 6, 9 లేదా 12 నెలల EMIలుగా మార్చుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story