నగరవాసికో మంచి వార్త.. ఇల్లు కట్టుకోవాలంటే..!

నగరవాసికో మంచి వార్త.. ఇల్లు కట్టుకోవాలంటే..!
స్నేహితుడి బలవంతం మీదో.. అమ్మమాటకి కట్టుబడో ఊరికి మరీ దగ్గరగా కాకుండా, మరీ దూరంగా కాకుండా తన దగ్గరున్న డబ్బులతో ఓ నగరవాసి స్థలం కొన్నాడనుకుందాం.

స్నేహితుడి బలవంతం మీదో.. అమ్మమాటకి కట్టుబడో ఊరికి మరీ దగ్గరగా కాకుండా, మరీ దూరంగా కాకుండా తన దగ్గరున్న డబ్బులతో ఓ నగరవాసి స్థలం కొన్నాడనుకుందాం. బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టాడు. మళ్లీ ఆ కట్టిన ఇంటిపై కూడా లోన్ ఇస్తారని తెలిసింది. అది ఎలా తీసుకోవాలని ఎంక్వైరీ చేస్తే.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గురించి తెలిసింది.

మెట్రో నగరాల్లో కొద్దిపాటి వసతులున్న ఇల్లు కొనాలన్నా కనీసం రూ.35 లక్షలన్నా కావాలి. ఇంత మొత్తాన్ని తీసుకోవాలంటే సంవత్సరానికి రూ.8 లక్షల ఆదాయం ఉంటే మంచిది. దీనివల్ల తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించడం సులువవుతుంది. ఇంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇంటి విస్తీర్ణాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి విస్తీర్ణం 1614 చదరపు అడుగుల వరకు ఉంటే ఈ పథకం వర్తిస్తుంది.

నిజానికి కట్టిన ఇంటిని కొనాలంటే బ్యాంకు మొత్తం లోను మంజూరు చేయదు. ఆ ఇంటి విలువలో కనీసం 20 శాతాన్ని కొనుగోలుదారులు భరించాల్సి ఉంటుంది. ఆ ఇంటి ఫొటోలు పెడుతూ పీఎంఆర్‌వైకి దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి.. అది వడ్డీతో కలిపి సుమారు రూ.15 నుంచి రూ.18 లక్షలు అవుతుంది. బ్యాంకు వాళ్లు వసూలు చేసే వడ్డీని బట్టి 20 లక్షలు కూడా అవ్వచ్చు. ఇందులో 2.67 లక్షల రూపాయిల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. అంటే బ్యాంకు వారికి మీరు కట్టాల్సిన మొత్తంలో నుంచి దీనిని మినహాయిస్తారు.

ఈరోజుల్లో హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనాలంటే దూరం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మెట్రో రైలు అందుబాటులో ఉండడంతో నగరవాసికి దూరం దగ్గరైంది. ఎల్‌బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం ఈ ప్రాంతాలన్నింటికీ రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పైగా లోన్ పరిమితిని కూడా రూ.28 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచారు. ఇది నిజంగా మధ్యతరగతి వాసికి శుభవార్తే. ఈ రేటుతో ఇళ్లు కట్టడానికి మరింత మంది బిల్డర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది.

ఈ పథకం కింద మొదటిసారి ఇల్లు కొనేవారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ పొందవచ్చు. గతంలో సబ్సిడీ రుణం రెండు నెలల్లో మంజూరయ్యేది. కానీ ఇటీవల జాప్యం పెరిగింది. దరఖాస్తుల సంఖ్య పెరగడమే దీనికి కారణం అని అధికారులు చెబుతున్నారు. అయినా సరే.. మన సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే చిన్నచిన్న ఇబ్బందులు తప్పవు మరి.

Tags

Read MoreRead Less
Next Story