GOOD NEWS: మొబైల్ వినియోగదారులకు శుభవార్త

మొబైల్ వినియోగదారులకు కేంద్ర టెలికాం శాఖ శుభవార్త చెప్పింది. ప్రీపెయిడ్ కనెక్షన్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు లేదా పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్‌కు మారాలనుకునే కస్టమర్ల కోసం నిబంధనలను సరళతరం చేసింది. దీనివల్ల వినియోగదారులు తమకు నచ్చిన ప్లాన్‌కు మారేందుకు పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది. ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఆధారిత కేవైసీ ప్రక్రియ ద్వారా ఈ మార్పులను సులభతరం చేసినట్లు టెలికాం శాఖ వెల్లడించింది. ఒక వినియోగదారుడు తన మొబైల్ సర్వీస్‌ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మార్చుకున్న తర్వాత, మళ్లీ మరోసారి ప్లాన్ మార్చుకోవాలంటే కనీసం 90 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. ఈ వ్యవధిని 'కూలింగ్ ఆఫ్ పీరియడ్'గా పరిగణించేవారు. అయితే, జూన్ 10న టెలికాం శాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం, ఈ నిరీక్షణ కాలాన్ని 30 రోజులకు కుదించారు. అంటే, ఒకసారి ప్లాన్ మార్చుకున్న తర్వాత, కేవలం 30 రోజుల వ్యవధిలోనే మరోసారి తమకు అనుకూలమైన ప్లాన్‌కు మారేందుకు అవకాశం కల్పించారు. ఈ కొత్త సదుపాయాన్ని పొందాలనుకునే వినియోగదారులు తమ సమీపంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల యొక్క కస్టమర్ సర్వీస్ కేంద్రాలను లేదా అధీకృత ఔట్‌లెట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఓటీపీ ఆధారిత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ మార్పును చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com