పెరిగిన పెట్రో ధరలు.. కేంద్రం తీసుకునే నిర్ణయంతో..

పెరిగిన పెట్రో ధరలు.. కేంద్రం తీసుకునే నిర్ణయంతో..
సౌదీ అరేబియా సహా ఒపెక్ దేశాలు డిమాండ్ పెంచే లక్ష్యంతో ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఈ ప్రభావం మన దేశంపై పడనుంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గి డిమాండ్ పెరగడంతో పాటు, చమురు ఉత్పత్తి దేశాల నిర్ణయం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా సహా ఒపెక్ దేశాలు డిమాండ్ పెంచే లక్ష్యంతో ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఈ ప్రభావం మన దేశంపై పడనుంది.

అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలు పెరిగితే, ఇది మన దేశంలోని వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత పెరిగాయి. వచ్చే వారం పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో గత ఏడాది లాక్ డౌన్ కాలంలో ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, ట్యాక్స్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి.

ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధర రూ.84లో పన్ను వాటా రూ.50కి పైగా ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే లీటర్ పెట్రోల్ పైన కనీసం రూ.5వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. దేశీయ చమురు రంగ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్ల చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story