Auto: తక్కువ ధరల్లో హార్లే డేవిడ్‌సన్ బైక్ విడుదల

Auto: తక్కువ ధరల్లో హార్లే డేవిడ్‌సన్ బైక్ విడుదల
రూ.2,29,000 ప్రారంభ ధరగా నిర్ణయించారు

బైక్ లవర్స్‌ని ఆకట్టుకోవడంలో హార్లే డేవిడ్‌సన్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. హై ఎండ్ సీసీలతో రోడ్లపై రయ్, రయ్ మంటూ దూసుకెళ్తాయి. తాజాగా హార్లే-డేవిడ్‌సన్ ఇండియా అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ X440ని విడుదల చేసింది. స్టన్నింగ్ లుక్స్‌, స్మార్ట్ ఫీచర్లతో చూపరులను ఆకర్షిస్తోంది.


క్రూయిజర్ బైక్‌గా రానున్న ఈ బైక్ డెనిమ్, వివిడ్, ఎస్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్ ధర రూ.2,29,000, టాప్ వేరింయట్ రూ.2,69,000 గా నిర్ణయించారు. బేస్ మోడల్‌ సింగిల్-టోన్ పెయింట్‌, వైర్-స్పోక్ వీల్స్‌తో వస్తుంది. మిడ్ వేరియంట్‌ను అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో రూపొందించారు. టాప్-స్పెక్ మోడల్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, 3D లోగోలు వంటి ప్రీమియం ఫీచర్లతో లోడ్ చేయబడింది. బ్లూటూత్ మాడ్యూల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫంక్షన్లు టాప్ మోడల్‌లో అదనపు ఆకర్షణలు. USB ఛార్జింగ్ పోర్ట్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంచారు. 440CC ఇంజిన్ సామర్థ్యంతో రోడ్లపై రానుంది. ఈ ఇంజిన్ సింగిల్-సిలిండర్, ఆయిల్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌, రెండు-వాల్వ్ సెటప్‌తో పనిచేయనుంది. గరిష్టంగా 6,000rpm వద్ద 27bhp, 4,000rpm వద్ద 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.


ఈ బైక్ 6 గేర్ల బాక్స్‌తో రానుంది. ముందు, వెనక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌ని కూడా అమర్చారు. సుమారుగా 190.5కేజీల బరువున్న బైక్, 13.5 లీటర్ల ఇంధన సామర్థ్యంతో రానుంది. స్టైలిష్ లుక్కుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ హార్లే-డేవిడ్‌సన్ బ్రాండింగ్‌తో కూడిన రౌండ్ హెడ్‌లైట్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్, మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, రెట్రో-స్టైల్ రౌండ్ ఇండికేటర్‌లు బైక్ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది.

మోటార్‌సైకిల్‌ను ట్రెల్లిస్ ఫ్రేంతో నిర్మించారు. సస్పెన్షన్ కోసం 43mm ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్‌లను ఉపయోగించారు. రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్‌లు ఉంచడంతో బ్రేకింగ్ సిస్టమ్ పనిచేయనుంది. డ్యూయల్-ఛానల్ యాంటి బ్రేకింగ్ సిస్టం(ABS), సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్‌ ఫీచర్లు అదనపు భద్రతను ఇస్తాయి.

170mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో గతుకుల రోడ్లపై మరింత సులువుగా ప్రయాణించవచ్చు. MRF కంపెనీ తయారు చేసిన 100/90-18 (ముందు) and 140/70-17 (వెనక) సైజుల్లో టైర్లు అమర్చారు. ఈ బైక్ మస్టర్డ్ ఎల్లో, మెటాలిక్ థిక్ రెడ్, మ్యాట్టె బ్లాక్ కలర్లలో లభిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story