HDFC, HDFC bank Merge: HDFC బ్యాంక్, HDFC ల విలీనం

HDFC, HDFC bank Merge: HDFC బ్యాంక్, HDFC ల విలీనం

భారత కార్పొరేట్ రంగంలో అతిపెద్ద విలీనం అమలుకు సమయం ఆసన్నమైంది. దేశంలో ప్రముఖ, పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC BANK, దేశీయ మోర్ట్‌గేజ్ రుణాల సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) లు విలీనం అవనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసిపోయి రూ.168 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా HDFC బ్యాంక్‌ అవతరించనుంది. కొత్త సంస్థకు రూ. 18 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉండనున్నాయి. జూన్ 30న ఈ ప్రక్రియ పూర్తవనుండగా, జులై 1న విలీనం అమల్లోకి రానుంది.

జూన్ 30న జరిగే బోర్డ్ సమావేశమే చివరిది అని HDFC ఛైర్మన్ దీపక్ పరేఖ్ వెల్లడించారు.విలీనం అనంతరం స్టాక్‌ మార్కెట్‌లో HDFC షేర్లు అన్నీ HDFC BANK షేర్లుగా మారనున్నాయి. ప్రతీ 25 HDFC షేర్లకు 42 HDFC BANK షేర్లను వాటాదారులకు కేటాయించనున్నారు. విలీనం నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఈ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నూతన బ్యాంక్ షేర్లు జులై 17 నుంచి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి.

గత సంవత్సరం ఏప్రిల్ 4న బ్యాంక్ ఈ విలీనానికి ఒప్పుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విలీనానికి ఆమోదం తెలపడంతో మార్గం సుగమం అయింది.

విలీనం అనంతరం HDFC శాఖలు బ్యాంక్ సర్వీస్ సెంటర్లుగా సేవలందించనున్నాయి. ఈ విలీనం ఇరు సంస్థల ఖాతాదారులకు లబ్ధి చేకూర్చనున్నాయి. బ్యాంక్ ఖాతాదారులకు తక్కువ వడ్డీ రేట్లకే గృహరుణాలు లభించే వీలుంది. సంస్థ ఖాతాదారులకు రుణాలు, క్రెడిట్ కార్డ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వంటి సేవలు లభించనున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story