Radhika Merchant: ఎవరీ రాధిక మర్చంట్.. ముఖేష్ అంబానీ కాబోయే కోడలి గురించి ఆసక్తికర విషయాలు..

Radhika Merchant: ఎవరీ రాధిక మర్చంట్.. ముఖేష్ అంబానీ కాబోయే కోడలి గురించి ఆసక్తికర విషయాలు..
Radhika Merchant: 2019లో అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది.

Radhika Merchant: వ్యాపారవేత్తలంటే ఎంత రిచ్ అయినా కూడా వారికి పెద్దగా పాపులారిటీ ఉండదు. కానీ దేశంలోని దాదాపు చాలామంది సామాన్య ప్రజలకు తెలిసిన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఎన్నో వ్యాపారాలను లాభాలతో ముందుకు నడిపిస్తూ ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు ముఖేష్ అంబానీ. అయితే ఇటీవల ముఖేష్ అంబానీకి కాబోయే కోడలిపై అందరి దృష్టి పడింది. దానికి కారణం ఆమె స్టేజ్‌పై చేసిన భరతనాట్యమే.


జియో వరల్డ్ సెంటర్‌లో రాధిక మర్చంట్ చేసిన భారతనాట్యం అందరినీ ఆకర్షించింది. ఈ ప్రోగ్రామ్‌కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. అయితే రాధిక మర్చంట్ గురించి అప్పటివరకు తెలియని నెటిజన్లు.. తన గురించి గూగుల్ చేయడం మొదలుపెట్టారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ విరెన్ మర్చంట్, శైలా మర్చంట్‌ కూతురే రాధిక మర్చంట్.


ఎప్పటినుండో అంబానీ ఫ్యామిలీ, మర్చంట్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే అంబానీ ఫ్యామిలీ పార్టీల్లో కూడా రాధిక అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది. ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లిలో కూడా రాధిక సందడి చేసింది. ఇది చూసిన వాళ్లంతా రాధిక.. అంబానీ ఫ్యామిలీలో ఒకటైపోతుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే సంవత్సరం తర్వాత ముఖేష్ అంబానీ రెండో కొడుకు అనంత్‌ అంబానీతో రాధిక ఎంగేజ్‌మెంట్ జరిగింది.


2019లో అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే వీరిద్దరికి 2019లోనే పెళ్లి అయిపోయిందంటూ కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఇరు కుటుంబాలు స్పందించలేదు. ప్రస్తుతం అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ డైరెక్టర్‌గా చేస్తు్న్నాడు.

Tags

Read MoreRead Less
Next Story