హీరో ఎక్స్ ట్రీమ్.. బైక్ ప్రియుల కోసం మార్కెట్లోకి వచ్చిన మరో మోడల్

హీరో ఎక్స్ ట్రీమ్.. బైక్ ప్రియుల కోసం మార్కెట్లోకి వచ్చిన మరో మోడల్
అత్యాధునిక హంగులు, మరిన్ని ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చింది.

టూవీలర్ వాహనదారుల మనసు దోచుకుంటున్న బైక్స్ సరికొత్త మోడల్స్ తో మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా హీరో సంస్థ నుంచి ఎక్స్ ట్రీమ్ 200 ఎస్ భారత మార్కెట్లోకి వచ్చింది. బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మోటార్ అత్యాధునిక హంగులు, మరిన్ని ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ షోరూంలో హీరో ఎక్స్ ట్రీమ్ 200 ఎస్ బీఎస్ 6 బైక్ ధర వచ్చేసి రూ.1.16 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.

ఈ బైక్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. డిజైన్ లో కొద్ది మార్పులు చేసింది సంస్థ. ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రియల్ కౌల్ డిజైన్, యాంటి స్లిప్ సీట్లు లాంటి వాటిలో మార్పులు చేసింది సంస్థ. వీటితో పాటు ఫుల్లీ డిజిటల్ ఇన్స్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటి, టర్న్ బై టర్న్ నేవిగేషన్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హీరో ఎక్స్ ట్రీమ్ 200 ఎస్ మోటార్ సైకిల్.. సరికొత్త కలర్ ఆప్షన్ తో అందుబాటులోకి వచ్చింది. పెరల్ ఫేడ్ లెస్ వైట్, స్టాండర్డ్ స్పోర్ట్ రెడ్, ప్యాంథర్ బ్లాక్ కలర్స్ తో వాహన ప్రియులను ఊరిస్తోంది.

ఇక ఇంజన్ విషయానికి వస్తే..

ఈ సరికొత్త మోటార్ సైకిల్.. 199 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 17.8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 16.4 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది. వీటితో పాటు ఫ్రంట్ సైడ్ స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ ను హీరో ఎక్స్ ట్రీమ్ 200 ఎస్ మోటార్ సైకిల్ కలిగి ఉంది. 276 ఎంఎం ఫ్రంట్ బ్రేక్స్, 220 ఎంఎం ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేకులు, సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. మార్కెట్లో ఈ బైక్ కు పోటీగా బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, కేటీఎం ఆర్సీ200 లాంటి బైక్స్ ఉన్నాయి.

Tags

Next Story