Hindenburg Report : అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది

X
By - Vijayanand |3 Feb 2023 1:30 PM IST
పార్లమెంట్‌ను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. అదానీ అంశంపై చర్చకు విపక్షాలు మూకుమ్మడిగా పట్టుపడుతున్నాయి.
స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. మరోవైపు అదానీ గ్రూప్ పై పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మొన్న ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ పై అదానీ వెనక్కు తగ్గితే...ఇక రీసెంట్ గా అదానీ షేర్లపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రత్యేకంగా నిఘా పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
పార్లమెంట్‌ను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. అదానీ అంశంపై చర్చకు విపక్షాలు మూకుమ్మడిగా పట్టుపడుతున్నాయి. ఖర్గే కార్యాలయంలో సమావేశమైన విపక్షాలు ఈ అశంపై చర్చించాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణకూ డిమాండ్ చేస్తున్నాయి. అటు.. తాజా పరిణామాలపై దృష్టి పెట్టిన ప్రదాని మోదీ.. సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com