hindenburg Report Effect: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ

భారత దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా ముఖేష్ అంబానీ నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీన్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీని అధిగమించి ప్రపంచలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేధిక తర్వాత, అదానీ మంగళవారం బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో మూడవస్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయారు.
హిండెన్ బర్గ్ నివేధిక ప్రకారం అదానీ గ్రూప్ చాలా కాలంగా ఇత్తడి స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు చేస్తున్నట్లు ఆరోపించింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్స్ లోనే అదానీ గ్రూప్ USD 50 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను కోల్పోయింది. షార్ట్ సెల్లింగ్ లో నైపుణ్యం కలిగిన హిండెన్ బర్గ్ నివేధికతో అదానీ షేర్లు ఆవిరయ్యాయి. ప్రపంచంలో సంపన్నుడైన భారతీయుడుగా ముఖేష్ అంబానీ అవతరించగా, రెండవ స్థానంలో అదానీ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com